ఆయుర్వేదంలో శతావరికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని ‘మూలికల రాణి’ అని పిలుస్తారు. శతావరి వేర్ల పొడి లేదా ఎండిన ముక్కలతో తయారుచేసే ఈ టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. ఇదొక అద్భుతమైన ఔషధం. ముఖ్యంగా మహిళల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను, రక్షణను అందించడంలో శతావరి టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.
మహిళల హార్మోన్లు సమతుల్యం: ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పిసిఓడి (PCOD), పిసిఓఎస్ (PCOS) మరియు క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి శతావరి టీ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే వయసు పైబడిన మహిళల్లో మెనోపాజ్ సమయంలో వచ్చే ఒళ్లు వేడెక్కడం (హాట్ ఫ్లాషెస్), రాత్రి పూట చెమటలు పట్టడం వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది.
బాలింతలకు మరియు సంతానోత్పత్తికి మేలు: ప్రసవం తర్వాత బాలింతలలో తల్లి పాలు పెరగడానికి ఆయుర్వేదంలో శతావరిని అద్భుతమైన ‘గెలాక్టగోగ్’గా గుర్తిస్తారు. ఇది మహిళల్లో గర్భాశయాన్ని బలోపేతం చేసి, సంతానోత్పత్తి అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి. రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర వచ్చేలా చేస్తాయి.
కడుపు ఉబ్బరం, అసిడిటీకి చెక్: ఈ టీ కేవలం హార్మోన్లకే కాదు, మన జీర్ణవ్యవస్థను కూడా క్లీన్ చేస్తుంది. కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పేగుల్లో వచ్చే అల్సర్లను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.ఇక

కేవలం మహిళలకే కాకుండా, పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని, వీర్యకణాల నాణ్యతను పెంచడానికి కూడా శతావరి ఉపయోగపడటం దీని మరో విశేషం.
ఇంట్లోనే శతావరి టీ తయారీ విధానం: ఈ హెర్బల్ టీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో అర చెంచా శతావరి వేర్ల పొడి లేదా కొన్ని ఎండిన శతావరి ముక్కలు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించి వడకట్టాలి. ఇక ఇందులో రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. నచ్చిన వారు దీనిని పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కెఫిన్ ఎక్కువగా ఉండే నార్మల్ టీ, కాఫీలకు బదులుగా వారంలో కొన్ని సార్లు ఈ శతావరి టీని అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది. ఇక ముఖ్యంగా హార్మోన్ల సమస్యలతో సతమతమయ్యే మహిళలు ఈ సహజసిద్ధమైన ఆయుర్వేద టీ ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
గమనిక: శతావరి టీ సాధారణంగా సురక్షితమైనదే అయినప్పటికీ.. గర్భవతులుగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు, దీనిని రెగ్యులర్‌గా తీసుకునే ముందు ఒకసారి ఆయుర్వేద నిపుణులను లేదా మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
The post ఇంట్లోనే శతావరి టీ తయారీ.. స్త్రీలకు అద్భుత లాభాలు appeared first on Manalokam – Latest Telugu News & Updates.