Reading Time: < 1 minute
Bvs Ravi Reveals Puri Jagannadh Working Style Vijayendra Prasad Comments

BVS Ravi: టాలీవుడ్‌లో డైనమిక్ డైరెక్టర్‌గా, తనదైన స్పీడ్‌తో సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన వర్కింగ్ స్టైల్‌పై, కథలు రాసే విధానంపై ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి ఇటీవల పాల్గొన్న ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో ఎందరో దర్శకులతో పనిచేసిన అనుభవం ఉన్న రవి.. పూరి జగన్నాథ్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో పూరి జగన్నాథ్ రైటింగ్ స్పీడ్, ఆయన క్యారెక్టరైజేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పూరితో ఉన్న వర్కింగ్ రిలేషన్ గురించి మాట్లాడుతూ.. “పూరి జగన్నాథ్‌తో కలిసి పనిచేయడం అనేది ఎప్పుడూ ఒక ప్యూర్ ప్లెజర్ (స్వచ్ఛమైన ఆనందం). ఆయనతో వర్క్ చేయడం ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్” అని కొనియాడారు. పూరి జగన్నాథ్ ఆలోచనల్లో ఉండే వేగం, సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చేయాలనే కసి ఆయనను ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డైరెక్టర్‌గా నిలబెట్టాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు గతంలో పూరి జగన్నాథ్ గురించి అన్న ఒక ఆసక్తికరమైన మాటను ప్రస్తావించారు. “పూరి జగన్నాథ్ గనుక ఒక్క క్షణం ఆగి, కాస్త ఆలోచించి కథ రాస్తే.. ఆ కథ అద్భుతంగా ఉంటుంది, సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కానీ, ఆయన ఎప్పుడూ ఆగి ఆలోచించడు.. అంతే ప్రెజర్‌తో, అదే స్పీడ్‌తో దూసుకుపోతాడు” అని గుర్తుచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్‌పై బి.వి.ఎస్ రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.