Reading Time: < 1 minute

INTUC తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నీరటి శంకర్

Caption of Image.

సుల్తానాబాద్, వెలుగు: ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు నీరటి శంకర్  నియమితులయ్యారు.  ఈ మేరకు ఐఎన్ టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని హైదరాబాద్​లో గురువారం రాష్ట్ర మైనింగ్, లేబర్ మినిస్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా శంకర్ అందుకున్నారు. 

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ఐఎన్ టీయూసీ బలోపేతానికి, కార్మికుల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, నేషనల్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, నేషనల్ సెక్రటరీ  బాబర్ సలీం పాషా, సెక్రటరీ జనరల్ జన ప్రసాద్ తదితరులకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.