Reading Time: 2 minutes
Pak Army Spokesperson Questioned Indian Army English Usage Gets Trolled

Pakistan: పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, ఐఎస్‌పీఆర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం మీడియా సమావేశంలో ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని ఆయన ప్రశ్నించారు. అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై సొంతదేశంలోనే నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు.

Read Also: Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ జరిగి ఒక ఏడాది గడిచిన సందర్భంగా భారత్ త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సాధించిన విజయాలను మరోసారి వివరించారు. 13 పాకిస్తాన్ విమానాలను, 11 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసినట్లు భారత సైనికాధికారులు వెల్లడించారు. అయితే, ఈ సమావేశంలో భారత అధికారులు ఇంగ్లీష్‌లో బ్రీఫింగ్ ఇవ్వడాన్ని చౌదరి ప్రశ్నించారు.

‘‘మీకు ఇంగ్లీష్‌లో మాట్లాడమని ఎవరు చెప్పారు..? ప్రపంచానికి మీ వెర్షన్ చెప్పేందుకే ఇలా మాట్లాడారా?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై పాకిస్తానీ ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. పాక్ ఆర్మీలో అధికారిక ఆదేశాలు, అంతర్గత కమ్యూనికేషన్స్, పత్రాలన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయని పాక్ ప్రజలు గుర్తు చేశారు. మాజీ పాక్ ఆర్మీ అధికారి, జర్నలిస్ట్ ఆదిల్ ఫరూఖ్ రజా కూడా చౌదరి వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు. గాజు ఇంట్లో ఉండేవారు ఇతరులపై రాళ్లు వేయకూడదని హితవు పలికారు. పాకిస్తాన్ సైన్యంలో పై నుంచి కింది స్థాయి వరకు అన్ని ఆదేశాలు ఇంగ్లీష్‌లోనే అందుతాయని చెప్పారు.