Reading Time: 2 minutes

అడవిలో సింహం.. పేటలో సేనాపతి రవి.. సందీప్ కిషన్ ‘పవర్ పేట’ గ్లింప్స్ రిలీజ్!

Caption of Image.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ పవర్ పేట ‘. పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఒక పవర్-ప్యాక్డ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

సేనాపతి రవి’గా సందీప్ విధ్వంసం

ఈ గ్లింప్స్ ఒక పక్కా మాస్ థియేటర్ వాతావరణంలో ప్రారంభమవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామా, అభిమానుల ఈలలు, కేకల మధ్య సందీప్ కిషన్ ఎంట్రీ పవర్‌ఫుల్‌గా ఉంది. నోట్లో సిగరెట్, కళ్ళకు స్టైలిష్ షేడ్స్, వింటేజ్ కాస్ట్యూమ్స్‌తో సందీప్ సరికొత్త ‘రగ్గుడ్’ లుక్‌లో మెరిశారు. ముఖ్యంగా స్క్రీన్ మీద పటాకులు విసురుతూ ఆయన చూపించిన యాటిట్యూడ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

అడవిలో సింహం ఉచ్చ పోసి ఇది నా చోటు అని చెబుతుంది.. ఇక్కడ ఉచ్చ పోయిస్తే కానీ ఆ చోటు నీది కాదు అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సినిమాలోని తీవ్రతను చాటి చెబుతోంది. ఇందులో సందీప్ పోషిస్తున్న ‘సేనాపతి రవి’ అనే ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కథాంశం.. 

ఒక సామాన్యుడు రాజకీయ శిఖరాలను ఎలా అధిరోహించాడు అనే కథాంశంతో  ప్రేమ, గౌరవం, రాజకీయం అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సందీప్ కిషన్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నారు.‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన మార్క్ ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.  ప్రముఖ కెమెరామెన్ మధి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ను అత్యంత సహజంగా, గ్రాండ్‌గా చిత్రీకరించారు.  నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

►ALSO READ | రికార్డు స్థాయిలో రజనీకాంత్, కమల్ హాసన్ రెమ్యునరేషన్.. KHxRK’ బడ్జెట్ ఎంతంటే?

ఇటీవలే హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాల్లో ఉన్న ఒక పురాతన థియేటర్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సందీప్ కిషన్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవనుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్న ఈ ‘పవర్ పేట’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి..
 

 

©️ VIL Media Pvt Ltd.