పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ !Caption of Image.
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ టీఎన్ రవి రద్దు చేశారు. దీంతో.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పాలనకు అధికారికంగా తెర పడింది. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు దీదీ ససేమిరా అనడంతో గవర్నర్ తనకు ఉన్న అధికారంతో అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వ పదవీ కాలం మే 7 (గురువారం)తో ముగిసింది. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో మే 9న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.