
మస్కట్‌లో బందీగా చిక్కుకున్న ఒక తెలుగు మహిళ తనను కాపాడాలని వేడుకుంటూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురానికి చెందిన షానాలా, ముగ్గురు పిల్లల తల్లి. నిరుపేద కుటుంబం కావడంతో, పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి ఒక ఏజెంట్ ద్వారా కొద్ది రోజుల క్రితం మస్కట్ వెళ్లారు. అక్కడ పని ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ ఆమెను ఒక సేటుకు అప్పగించారు. అయితే, ఆమె ఆశించిన దానికి భిన్నంగా అక్కడ దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి.శనివారం రాత్రి ఆమె సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో తన గోడును వెల్లడించారు
మరిన్ని వీడియోల కోసం :