కోయదొరల కోడికూరకు కావలసిన పదార్థాలు: అర కిలో నాటు కోడి ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు,
రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అరటేబుల్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్
నూనెను తీసుకోవాలి.
కోయదొరల కోడికూరకు మసాలాకు కావాల్సిన పదార్థాలు: మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ గస గసాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకోవాలి. మీరు వీటిని పొడి మసాలాగా పట్టుకోవాలి ఇలా చేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది.
కోయదొరల కోడికూర ఎలా తయారు చేయాలంటే? ముందుగా నాటుకోడి ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి ఇంకా వాటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 10 నుంచి 15 నిమిషాల పాటువాటిని బాగా మరి గించుకోవాలి. ఇంకా వీటిలో స్పెషల్ మసాలాను వేస్తే కూర రుచి అదిరిపోతోంది. అయితే, దీనిని కొద్దీ మొత్తంలోనే వేసుకోవాలి.
ఇలా కూర వండుకోవాలి : ఇప్పుడు పాన్ లో మూడుటేబుల్ స్పూన్స్ ఆయిల్ చేసి దానిని బాగా వేడి చేసి ఉల్లిపాయలు కూడా దానిలో బంగారు కలర్లోకి వచ్చే వరకు వాటిని బాగా వేయించాలి. ఇంకా దీనిలో పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు వీటిని బాగా వేయించాలి.
ఇంకా దీనిలో టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఆ తరవాత దానిలో నాటు కోడి ముక్కలు వేసి దీనిలో బాగా కలపాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఐదు నుంచి 10 నిమిషాలు మగ్గించి కిందకు దించుకోవాలి.




