Reading Time: < 1 minute

టెలిగ్రామ్ సరే.. మరి వాట్సాప్ కూడా బంద్ చేస్తారా..?

Caption of Image.

నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా.. తప్పుడు ప్రచారం కాకుండా.. విద్యార్థులను మోసం చేయకుండా ఉండేందుకు టెలిగ్రామ్ యాప్ను బంద్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15 నుంచి జూన్ 21వ తేదీ వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్ బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.

టెలిగ్రామ్ యాప్ సరే.. మరి వాట్సాప్ సంగతి ఏంటనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎందుకంటే.. ఎగ్జామ్ పేపర్లు లీక్ అయిన కొన్ని సందర్భాల్లో వాట్సాప్లో కూడా పేపర్ లీక్ అయిన ఘటనలు ఉన్నాయి. అంతెందుకు మన తెలంగాణలోనే.. 2026 టెన్త్ ఎగ్జామ్స్లో వాట్సాప్ ద్వారా పేపర్ లీక్ అయింది.

టెన్త్ పరీక్ష సమయంలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు సెల్‌‌ఫోన్ ద్వారా బయటకు వెళ్లిన ఘటనపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్ చేశారు.

►ALSO READ | బర్త్‌డే వేడుకల్లో ఘోరం.. మూడేళ్ల పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చిన కేక్.. ఏం మింగాడో తెలుసా ?

ఆలూర్ మండలంలోని జడ్పీ హైస్కూల్‌‌లో పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్‌‌గా ఉన్న ఎన్.సాగర్, క్లర్క్‌‌గా విధులు నిర్వహించిన ఉమేందర్ రూల్స్​కు విరుద్ధంగా సెల్‌‌ఫోన్‌‌ను ఎగ్జామ్​ సెంటర్​లోకి తీసుకెళ్లారు. పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి దగ్గర నుంచి తెలుగు ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న ఉమేందర్ దానిని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపాడు. తన బంధువుల పిల్లవాడి కోసం పంపిన ఈ క్వశ్చన్​ పేపర్ తర్వాత వైరల్ అయింది.

అయితే.. వాట్సాప్ కు, టెలిగ్రామ్ కు పెద్ద తేడా ఏంటంటే.. వాట్సాప్‌లో షేర్ చేసే ఫైల్స్కు సైజ్ విషయంలో పరిమితి ఉంది. టెలిగ్రామ్లో ఎలాంటి కంప్రెషన్ లేకుండా 2GB సైజ్ ఫైల్స్ను కూడా షేర్ చేయొచ్చు. అందుకే.. పైరసీ సినిమాలకు, పేపర్ లీక్స్కు నేరగాళ్లు టెలిగ్రాంను మాధ్యమంగా ఎంచుకుంటున్నారు. వాట్సాప్‌లో ఫైల్ షేరింగ్ విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్ల హై క్వాలిటీ పరీక్ష పత్రాలను షేర్ చేసుకోవడానికి నేరగాళ్లు వాట్సాప్ను పెద్దగా వాడరు.

©️ VIL Media Pvt Ltd.