
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం కెరీర్ పరంగానే కాకుండా, పర్సనల్ లైఫ్‌లోనూ ఫుల్ జోష్ లో ఉంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను పెళ్లాడిన తర్వాత ఈ కన్నడ బ్యూటీ మరింత గ్లోయింగ్‌గా మారిపోయింది. లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో రష్మిక తన మ్యారేజ్ లైఫ్, కెరీర్‌పై చేసిన క్రేజీ కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడమే బిగ్గెస్ట్ డెసిషన్..
మీ జీవితంలో మీరు తీసుకున్న అత్యంత సంతోషకరమైన నిర్ణయం ఏంటి? అని ఓ అభిమాని అడగ్గా.. రష్మిక ఏమాత్రం తడుముకోకుండా.. “నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోవడమే నా లైఫ్‌లో నేను తీసుకున్న బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ డెసిషన్” అంటూ లవ్ ఎమోజీలను జోడించింది. గత ఏడాది అక్టోబర్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
నా లైఫ్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ….
ప్రస్తుత జీవితాన్ని ఒక్క మాటలో చెప్పమంటే.. అది ఒక్కమాటలో చెప్పలేను. నా కల నిజం కావడం (Dream come true) అని చెబుతాను అంటూ మురిసిపోయింది. మీ గ్లోయింగ్ సీక్రెట్ ఏంటని అడగ్గా.. మనలోని అమాయకత్వాన్ని, పిల్లాడిలాంటి మనస్తత్వాన్ని గౌరవించే భాగస్వామి పక్కన ఉంటే జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది అంటూ భర్త విజయ్‌పై ప్రేమను కురిపించింది.
Get Married To my best friend (@TheDeverakonda)…❤️#VijayDeverakonda #Rashmika @iamRashmika pic.twitter.com/rgXZoZz0XB
— Anonymous (@__GirDhar) June 14, 2026
‘కాక్‌టెయిల్ 2’తొ హంగామా..
వివాహం తర్వాత రష్మిక నటిస్తున్న మొదటి హిందీ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. హోమీ అదజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ మూవీ జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ‘దియా’ గురించి చెప్తూ.. సౌత్ ఢిల్లీకి చెందిన ఒక మొండి పిల్లకు కాస్త రూడ్ క్యారెక్టర్ ఇది. రియల్ లైఫ్‌లో నాకు పూర్తిగా ఆపోజిట్ అని చెప్పింది. సెట్స్‌లో కృతి ఎనర్జీ అదిరిపోతుంది. మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా ఆర్గానిక్‌గా కుదిరింది. తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. షాహిద్ సెట్స్‌లో ఉంటే ఎప్పుడూ పాజిటివిటీనే. అందరినీ నవ్విస్తూ ఎనర్జిటిక్‌గా ఉంచుతారని తెలిపింది.
►ALSO READ | Samantha: నేను గర్వంగా చెప్పుకోలేని సినిమాలు చేశా.. సమంత ఎమోషనల్ కామెంట్స్!
విజయ్‌తో మళ్లీ స్క్రీన్ షేరింగ్..
టాలీవుడ్‌లో రష్మిక చేతిలో ప్రస్తుతం ‘మైసా’, ‘రణబలి’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రణబలి’ సినిమా ద్వారా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ, రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి రష్మిక అటు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే, ఇటు కెరీర్‌లోనూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లైఫ్‌ను లీడ్ చేస్తోంది..