Reading Time: < 1 minute

మణికొండలో క్షుద్రపూజల కలకలం.. కళ్లల్లో కారం చల్లుకుని కొట్టుకున్న మహిళలు

Caption of Image.

హైదరాబాద్ లో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏకంగా కంట్లో కారం చల్లుకుని కొట్టుకునే వరకు వచ్చింది. మణికొండ శివాజీ నగర్‌లో జూన్ 16 (మంగళవారం) వెలుగు చూసింది ఈ ఘటన. సోమవారం అమావాస్య కావడంతో.. ఒక కుటుంబం రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీసింది. 

ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపారు. 

వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లింది. దీంతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

©️ VIL Media Pvt Ltd.