Reading Time: 2 minutes

న్యూజిలాండ్తో మ్యాచ్ డ్రా.. అర్ధరాత్రి ఇరాన్ టీమ్‌ను వెళ్లగొట్టిన అమెరికా.. కోచ్ ఫైర్!

Caption of Image.

Iran Football Team: ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026లో ఆట కంటే కూడా పొలిటికల్ డ్రామా వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. నిన్న (జూన్ 15న) రాత్రి జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 2–2తో గట్టిగా ఫైట్ చేసి మ్యాచ్ డ్రా చేసుకున్న ఇరాన్ టీమ్‌కు.. కొన్ని గంటలకే అమెరికా అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. మ్యాచ్ అయిపోయాక హ్యాపీగా రాత్రి లాస్ ఏంజెల్స్‌లోనే ఉండి, బాడీ రికవరీ అయ్యాక మరుసటి రోజు వెళ్దామని ప్లాన్ చేసుకున్న ఇరాన్ ప్లేయర్లను.. టైమ్ లేదు బ్రో, వెంటనే ఇక్కడి నుంచి ప్యాకప్ అవ్వండి అంటూ అర్ధరాత్రి బలవంతంగా ఫ్లైట్ ఎక్కించి 140 మైళ్ల దూరంలో ఉన్న మెక్సికోలోని టిజువానా (Tijuana) బేస్ క్యాంప్‌నకు పంపించేశారు. 

మాకు రెస్ట్ తీసుకునే టైమ్ కూడా ఇవ్వలే: ఇరాన్ కోచ్ 
మ్యాచ్ ముగిసిన గంటన్నర లోపే ఇరాన్ టీమ్‌ను ఖాళీ చేయమనడంపై హెడ్ కోచ్ అమీర్ ఘాలెనోయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అయిపోయాక ప్లేయర్స్ అలసట నుంచి కోలుకోవడానికి (Recovery) కూడా కనీసం టైమ్ ఇవ్వకుండా.. మీరు ఇప్పుడే విమానం ఎక్కి టిజువానా వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అసలు మా షెడ్యూల్ ప్రకారం మేము రేపు మధ్యాహ్నం లంచ్ అయ్యాక వెళ్లాల్సింది. కానీ మా లైఫ్ ప్లాన్స్ మొత్తం ఎవరో ఎక్కడో కూర్చుని డిసైడ్ చేస్తున్నట్లుంది.. ఈ వరల్డ్ కప్‌లోనే అత్యంత అణచివేతకు గురవుతున్న బ్యాడ్ లక్ టీమ్ బహుశా మాదే (ఇరాన్) కావొచ్చు అంటూ కోచ్ కన్నీరు పెట్టుకున్నాడు. 

వీసాల రిజెక్ట్ పంచాయితీ:
గత ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్‌తో వార్ సిట్యుయేషన్ నడుస్తుంది. తమ గ్రూప్ మ్యాచ్‌లను అమెరికా నుంచి వేరే దేశానికి షిఫ్ట్ చేయాలని ఇరాన్ చేసిన రిక్వెస్ట్‌ను ఫిఫా (FIFA) అస్సలు పట్టించుకోలేదు.. దాంతో ఇరాన్ ఇష్టం లేకపోయినా ఇక్కడే ఆడాల్సి వస్తోంది.

* వీసా లొల్లి: ఇరాన్ కెప్టెన్ మెహదీ తారెమి (Mehdi Taremi) మాట్లాడుతూ.. తమ ప్రిపరేషన్స్ మొత్తం ఒక పెద్ద ‘డిజాస్టర్’ అని చెప్పుకొచ్చాడు. తమ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, కోచింగ్ సపోర్ట్ స్టాఫ్, మీడియా అధికారులకు అమెరికా వీసాలు ఇవ్వకుండా అమెరికా రిజెక్ట్ చేసిందని, అసలు ఫిఫా కూడా తమకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదని తారెమి తీవ్రంగా మండిపడ్డాడు. 

గ్రౌండ్‌లో తగ్గేదేలే అంటున్న ఇరాన్:
ఒకవైపు స్టేడియం బయట ఇరానియన్ అమెరికన్ ఫ్యాన్స్ తమ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఈలలతో గొడవ చేస్తున్నా.. మ్యాచ్‌లో మాత్రం ఇరాన్ ప్లేయర్లు గట్టిగానే తలపడ్డారు. న్యూజిలాండ్ జట్టు రెండు సార్లు లీడ్‌లోకి వెళ్లినా.. ఇరాన్ యంగ్ ప్లేయర్ మొహమ్మద్ మొహెబ్బి (Mohammad Mohebbi) 64వ నిమిషంలో ఒక కిర్రాక్ గోల్ కొట్టి స్కోరును 2–2తో సమం చేసి జట్టుకు ఒక పాయింట్ తెచ్చిపెట్టాడు.

నెక్స్ట్ మ్యాచ్ కూడా అక్కడే.. మళ్లీ రావాల్సిందే: 
ఈ అవమానం అంతా భరించి మెక్సికో బోర్డర్‌కు వెళ్ళిపోయిన ఇరాన్ టీమ్.. తమ నెక్స్ట్ మ్యాచ్ కోసం మళ్లీ ఇదే సోఫి స్టేడియం (SoFi Stadium) కి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆదివారం ఇరాన్ జట్టు బెల్జియంతో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ టైమ్‌లో అమెరికా ఎలాంటి కొత్త రూల్స్ పెడుతుందో.. దానికి ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అనేది చూడాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.