
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 165 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు అయ్యాయి. 2026, జూన్ 15 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా మంగళవారం (జూన్ 16) నిర్వహించిన తనిఖీలలో 1200కు పైగా వాహనాలు తనిఖీ చేసి 165 వాహనాలపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఇందులో ఫిట్ నెస్ లేని 40 బస్సులను సీజ్ చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఈ తనిఖీలు కొనసాగుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.
►ALSO READ | తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం.. ఇంట్లో ACB సోదాలు.. రూ.5 కోట్లు దొరికినయ్ !