Reading Time: < 1 minute
A Star Hero Facing A String Of Flops Has Appointed A Team To Listen To Scripts

బాలీవుడ్‌లో షాహీద్ కపూర్ ఇమేజ్ మార్చేసిన ఘనత సందీప్ రెడ్డి వంగాదే. కబీర్ సింగ్‌ అతడి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రం. ఈ మాసివ్ హిట్ తర్వాత లవర్ బాయ్ స్టార్ హీరోలకు కాంపిటీటర్ అవుతాడనుకుంటే.. ఫ్లాప్స్ టేస్ట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ ఏడేళ్లలో ఫర్జీ వెబ్ సిరీస్ కాకుండా ఐదు సినిమాలు చేస్తే.. ఒక్కటే హిట్. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా తప్పా మిగిలినవన్నీ డిజాస్టర్సే.

షాహీద్ బాక్సాఫీస్ దగ్గర తడబడటానికి కారణం స్క్రిప్ట్ సెలక్షనట. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే వెల్లడించాడు. గతంలో తనొక్కడినే కథ విని లాక్ చేసేసేవాడినని.. కానీ దేవా, ఓ రోమియో ఫ్లాప్స్ తర్వాత జ్ఞానోదయం అయ్యిందంటున్నాడు. కెమెరా ముందు ఎలా నటించాలో తెలుసుగాని.. ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావట్లేదన్న హీరో.. ఇకపై ఒంటరిగా కాకుండా టీంతో కలిసి కథలు వింటాడట. షాహీద్ నుండి వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కాక్ టైల్2. కృతిసనన్, రష్మిక మందన్నతో కలిసి జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ లవర్ బాయ్. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు హీరో. దీని తర్వాత ఫర్జీ2లో నటించనున్న కబీర్ సింగ్ కొత్త సినిమా కబురు వినిపించలేదు. డ్రాగన్‌లో నెగిటివ్ రోల్‌కు కమిటయ్యాడని వార్తలే తప్ప.. అఫీషియల్ కాలేదు. ఇక పైన చెప్పుకున్న స్టేట్ మెంట్ ప్రకారం చూస్తే.. షాహీద్ సినిమా ఒప్పుకోవాలంటే అతడి టీం ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలేమో?