
భోజనానికి ముందు ఉసిరికాయ తినడం వల్ల ఎంత మేలు జరుగుతుందో డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించారు. ఉసిరికాయను భోజనానికి ముందు తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. షుగర్ కంట్రోల్ కోసం ప్రీలోడింగ్ ఫుడ్స్ ఎలా తింటారో.. అలా ఉసిరికాయను కూడా తీసుకోవచ్చు.
భోజనం చేశాక రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉండాలంటే.. మధుమేహం సమస్య ఉన్న వాళ్లు భోజనానికి ముందు ఉసిరికాయలను తినడం తప్పనిసరి. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ మల్టీడిసిప్లినరీ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. ఉసిరిలోని పాలిఫెనాల్స్ గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్లో ఉంచడంలో ఉసిరికాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలా అని మోతాదుకు మించి ఉసిరికాయను తీసుకున్నా ప్రమాదమే.
ఇది మాత్రమే కాదు.. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజూ ఏ రూపంలో అయినా ఒక ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. మీడియం సైజు ఉసిరికాయ తినడం వల్ల శరీరానికి 600 నుంచి 700 మిల్లీ గ్రాముల విటమిన్-సి లభిస్తుంది.