
పెట్రోల్ లో ఇథనాల్ మిక్సింగ్ ఏంటో గానీ వాహనదారులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. లక్షలు పెట్టి కొన్న బైక్స్, కార్స్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పోసిన తర్వాత రోడ్లపై మధ్యలోనే నిలిచిపోవటంతో అష్టకష్టాలు పడుతున్నారు. మరోపక్క వాహనాలను పరిశీలించిన మెకానిక్స్ అసలు ప్లాబ్లమ్ ఇథనాల్ పెట్రోల్ అని కన్ఫమ్ చేస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ ఆసరాగా మార్చుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీ మోసాలతో వాహనాలు దెబ్బతింటున్న ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఇథనాల్ + పెట్రోల్ = బైక్ ఢమాల్
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ధాటికి పాడైపోయిన మరో వాహనం
తన ద్విచక్ర వాహనం సడెన్‌గా ఆగిపోవడంతో రిపేర్ కోసం మెకానిక్ షాప్‌కు తీసుకెళ్లిన ఓ వ్యక్తి
వాహనాన్ని పరిశీలించాక.. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్లే పాడైపోయిందని గుర్తించిన మెకానిక్
బాటిల్లో పెట్రోల్… pic.twitter.com/OWWYm12lNM
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 14, 2026
ఇదే క్రమంలో ఒక బైకర్ ఈ85 పెట్రోల్ పట్టించుకునేందుకు బంకుకు వెళ్లగా ట్యాంక్ ఓపెన్ చేసి ఇంధనం నింపుతుంటే అక్కడికి భారీగా తేనెటీగలు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేనెటీగలు పెట్రోల్ ట్యాంక్ మూత దగ్గర వాలి ఇథనాల్ కలిపిన పెట్రోల్ లోని తీపి పదార్థాన్ని ఆస్వాధిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నోటిపై వేలు వేసుకుంటున్నారు.
Petrol Pump वाला भी ना Ethanol की जगह Sucrose मिलाने लगा है ।
किसी को Honey Bee Culture करना हो तो पेट्रोल ले जाओ Plantation की जरूरत नहीं
😂😂😂😂 pic.twitter.com/EbaGyZIMTr— 𝐃𝐫. 𝐕𝐞𝐝𝐢𝐤𝐚 𝐕𝐚𝐭𝐬 (@CivicConscious_) June 14, 2026
స్టోరీ ఇక్కడితో అయిపోలేదు.. ఒక కారు ఓనర్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పట్టించి దానిని ఇంటి దగ్గర పార్క్ చేయగా పెట్రోల్ ట్యాంక్ చుట్టూ నల్లటి చలిచీమలు వచ్చి చేరిన వీడియో హల్ చెల్ చేస్తోంది. వాస్తవానికి వర్షాకాలం, చలికాలం లాంటి సమయాల్లో మనం ఇళ్లలోని బెల్లం, చక్కెర లాంటి తీపి పదార్థాలకు ఈ చలిచీమలు రావటం చూస్తుంటాం. ఇలా అయితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్న వాహనాలు త్వరలోనే షెడ్డుకు వెళతాయ్ అంటున్నారు ఓనర్స్. వందల రూపాయలు ఖర్చు చేసి పెట్రోల్ కొంటుంటే అది వాహనాలను పాడుచేయటం చాలా మందిని కంటతడి పెట్టిస్తోంది. మోడీ సర్కార్ రాకమునుపు పెట్రోల్, డీజిల్ ఫ్రూర్ క్వాలిటీ తక్కువ రేటుకే దొరికేవని కానీ ఇప్పుడు ఏవేవో కలిపి వాటిని అమ్మటంతో తమ వాహనాలు పాడైపోతున్నాయని చాలా మంది వాపోతున్నారు.
🐜⛽ Video from Sikkim: Ants seem to have developed a taste for sugarcane juice… or maybe E85 fuel! 😂
A swarm of ants was spotted gathering around a spill of E85 petrol, which contains a high percentage of ethanol. The unusual sight has left many viewers joking that the ants… pic.twitter.com/YowTF2Z1wm
— Global Frontline News (@OmeyLad23) June 14, 2026