ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు స్కూల్ బ్యాగులో పెన్నులు, పెన్సిల్స్‌తో పాటు, లిప్ స్టిక్ వంటి కాస్మటిక్స్ కూడా తమతో పాటే తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా చాలా మంది విరామం సమయంలో లిప్ స్టిక్ వేసుకోవడం చేస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే కాస్మోటిక్స్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు అని, ఇది చర్మ వ్యాధులు మాత్రమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుకు కూడా కారణం అవుతుందని , కేరళలోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు కాస్మెటిక్స్ వాడకాన్ని నిషేధించింది.
కొల్లాం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లోని పిల్లలలో ఇటీవల పేగు క్యాన్సర్ కేసులు పెరిగాయని తిరువనంతపురంలోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం చేసిన ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. ఈ క్రమంలోనే చాలా మంది పిల్లలు పాఠశాల విరామం సమయంలో మేకప్ యూజ్ చేస్తున్నట్లు టీచర్స్ గమనించడంతో, కొల్లంలోని వయ్యనాడ్ ఉన్నత సెకండరీ పాఠశాలలో నో మేకప్ పాలసీని కవి కురీపుళా శ్రీకుమార్ అధికారికంగా ప్రారంభించారు.
ఇప్పటికే చాలా పాఠశాలలు నో మేకప్ పాలసీని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కొంత మంది స్కూల్ డ్రెస్ కోడ్‌లో భాగంగా లిప్ స్టిక్, కాజల్ వంటివి తీసుకెళ్లడం చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఇలాంటివి ఉపయోగించకూడదు అని వారు తెలియజేశారు. అయితే ఎవరు అయినా ఈ ఆంక్షలు ఉల్లంఘించినట్లు అయితే ఉపాధ్యాయులు , తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి మందలించడం జరుగుతుందంట.
అయితే ఇలా కేరళ ప్రభుత్వ పాఠశాలల్లో నో మేకప్ పాలసీ పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో సీసం, పారాబెన్స్, వంటి అనేక రకాల హానికరమైన కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌కి కారణం అయ్యే కెమికల్స్ ఎక్కువగా ఉండటం వలన, వాటిని చిన్న వయసులోనే పిల్లలు ఉపయోగిస్తే, అవి నోరు, చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి అతి చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడటం, హార్మోన్ల అ సమతుల్యత వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
మరీ ముఖ్యంగా ఆరు నుంచి 16 సంవత్సరాల పిల్లల చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందువలన పిల్లలు ఈ సమయంలో మేకప్ వంటివి వాడటం అస్సలే మంచిది కాదంట. అయితే గత ఏడాది కేరళ రాష్ట్రం మత్తు పదార్థాల నియంత్రణ శాఖ కాస్మోటిక్స్‌లో అధిక మొత్తంలో పాదరసం, ఉన్నట్లు తేల్చింది. దీంతో లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ ఉత్పత్తులలో చాలా వరకు పాఠశాల ప్రాంగణాలకు సమీపంలో ఉన్న దుకాణాలలో అమ్ముడవుతున్నాయని తెలియడంతో వాటిని నిషేదించింది. అలాగే వాటిని వాడకూడదు అంటూ పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే పాఠశాలలో నో మేకప్ పాలసీని కూడా ప్రారంభించారు.




