
హైదరాబాద్‌సిటీ, వెలుగు : వేసవి సెలవుల తర్వాత సోమవారమే స్కూల్స్తెరుచుకోనున్నాయి. రెండు నెలలు సమ్మర్హాలీడేస్లో ఎంజాయ్చేసిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్టూడెంట్స్వారి తల్లిదండ్రులు పుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ, స్కూల్‌బ్యాగులు, టిఫిన్‌బాక్స్‌లు, వాటర్బాటిల్స్కొనుగోళ్ల బిజీలో గడిపారు.
కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, సికింద్రాబాద్జనరల్బజార్తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. పుస్తకాలకు ప్రధాన కేంద్రమైన కోఠి, సుల్తాన్ బజార్‌తో పాటు, బేగంబజార్ తదితర ప్రాంతాలు రద్దీగా మారాయి. అయితే, గత ఏడాది కంటే ఈసారి ధరలు పెరిగాయని, అయినా, కొనక తప్పలేదని పలువురు తల్లిదండ్రులు చెప్పారు.