Reading Time: 2 minutes
Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన రూ.9ల స్టాక్.. మీదగ్గరుందా..!

One Global Service Provider Share Price: షేర్ మార్కెట్‌లో ఏ క్షణంలో ఏ షేరు ఎలా దూసుకుపోతుందో ఊహించడం కష్టం. కానీ కొన్ని స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షాలుగా మారుతుంటాయి. కేవలం ఐదేళ్ల క్రితం రూ. 9 వద్ద ఉన్న ఒక సాధారణ షేరు, ఇప్పుడు ఏకంగా రూ. 600 మార్కును దాటేసి ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. లక్ష రూపాయల పెట్టుబడిని ఏకంగా రూ. 68 లక్షలు చేసిన ఆ మల్టీబ్యాగర్ స్టాక్ కథేంటో ఓసారి చూద్దాం..

ఐదేళ్లలోనే అద్భుతం: రూ. 9 నుంచి రూ. 665ల వరకు దూకుడు..

మనం మాట్లాడుకుంటున్నది వన్ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ లిమిటెడ్ గురించే. ఐదేళ్ల క్రితం అంటే జూన్ 18, 2021 న ఈ కంపెనీ ఒక్కో షేరు ధర కేవలం రూ. 9.70 మాత్రమే. కానీ నేడు మార్కెట్ (16 జూన్ 2026) ముగిసే సమయానికి ఈ షేరు విలువ ఏకంగా రూ. 696 కి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఈ స్టాక్ దాదాపు 30 రూపాయలు పెరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏకంగా 6,759 శాతం రిటర్న్స్ అందించింది.

లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుడు ఎంతంటే?

ఈ షేరు సాధించిన వృద్ధిని అంచనా వేస్తే సామాన్యులకు సైతం షేర్ మార్కెట్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం ఎవరైనా ఈ కంపెనీ నమ్మకంతో ఒక లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి, నేటి వరకు ఆ షేర్లను విక్రయించకుండా అలాగే ఉంచుకుని ఉంటే, వారి లక్ష రూపాయల విలువ ఇప్పుడు ఏకంగా రూ. 68 లక్షలకు చేరి ఉండేది. కేవలం ఐదేళ్లలోనే ఇంతటి భారీ లాభాలను అందించడం వల్లే మార్కెట్ నిపుణులు దీనిని అసలైన మల్టీబ్యాగర్ స్టాక్ అని కొనియాడుతున్నారు.

ఏడాది కాలంలోనే డబ్బులు డబుల్..

ఈ కంపెనీ కేవలం ఐదేళ్ల సుదీర్ఘ కాలంలోనే కాదు, గడిచిన ఏడాది కాలంలో కూడా ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను పంచింది. జూన్ 20, 2025 న ఈ షేరు ధర రూ. 235 వద్ద ఉండగా, ప్రస్తుతం అది రూ. 410 మేర పెరిగి 161 శాతం లాభాన్ని నమోదు చేసింది. అంటే గతేడాది పెట్టుబడి పెట్టిన వారి డబ్బు కూడా ఏడాది తిరగకముందే రెట్టింపు కంటే ఎక్కువే అయింది. ఈ నిరంతర ఎదుగుదల కారణంగానే కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1,240 కోట్లకు చేరుకుంది.

అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది?

వన్ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ లిమిటెడ్ అనేది 1992లో ప్రారంభమైన ఒక భారతీయ సంస్థ. హెల్త్‌కేర్ సొల్యూషన్స్, లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. కేవలం వైద్య రంగ సేవలకే పరిమితం కాకుండా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ కన్సల్టెన్సీ సేవల రంగంలోకి కూడా అడుగుపెట్టి వేగంగా దూసుకుపోతోంది. ఈ వైవిధ్యభరితమైన వ్యాపార విస్తరణే కంపెనీ షేర్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఏదైన పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.