Reading Time: 2 minutes

జ్యోతిష్యం.. సోమావతి అమావాస్య వ్రతం.. సోలెడు వరాల మూట..

Caption of Image.

పితృదేవతల ఆశీస్సులు.. భగవంతుని అనుగ్రహం ఉంటే జీవితంలో సాధించలేదని ఏదీ ఉండదు.  జాతకంలో దోషాలు ఉన్న.. పూర్వీకుల ఆశీస్సులు లేకపోయినా చాలా కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.  అమావాస్య అంటే పితృదేవతలకు పండుగ రోజు. ఇక అధికమాసం..అమావాస్య.. సోమవారం వచ్చిదంటే చాలు.. పూర్వీకులు అందరూ కలుస్తారని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. మరి అలాంటి ప్రత్యేకమూన రోజున ( జూన్​ 15) కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే పితృదేవతల ఆశీస్సులతోపాటు.. దేవతల అనుగ్రహం కలిగి.. జాతకంలోదోషాలు తొలగిపోయి.. వరాల మూటలభిస్తుందని పండితులు చెబుతున్నారు.  

 పురాణాల ప్రకారం అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. భీష్ముడు యుధిష్ఠిరునికి అమావాస్య రోజున పితృ తర్పణం, దానం చేయడం వల్ల పితృ అనుగ్రహం లభిస్తుందని వివరించాడు.

జూన్​ 15న రోజున ఒక ప్రత్యేక కలయిక అధికమాసం+సోమవారం+అమావాస్య ..సోమవారానికి చంద్రుడు అధిపతి. అమావాస్య తిథి రోజున సూర్యుడు.. చంద్రుడు ఇద్దరు కలుస్తారు.  ఇక నక్షత్ర విషయానికి వస్తే ఈ రోజు ( జూన్​ 15) రాత్రి9.09 వరకు మృగశిర నక్షత్రం ఉంది. ఈ నక్షత్రానికి అధిదేవత సోముడు. 

ఈరోజు (జూన్​ 15) ప్రదోషకాలంలో మిథున లగ్నం ఉంది.  9 వస్థానంలో సూర్యుడు.. చంద్రుడు కలవడం వలన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శరీరం.. మనస్సుకు సంబంధించినది. ఈ స్థానం.. తండ్రి..పూర్వీకుల పరంపరను సూచిస్తుంది. 

ఇక 5వ స్థానం.. పూర్వ పుణ్యానికి సండంధించినది.  పిత్రు దేవతలు ఉత్తమలోకాలకు చేరుకొనేందుదకు వారి తరపున వారసులు భగవంతుని ప్రార్థిస్తూ.. వారికి తర్పణాలు వదలాలని జ్యోతిష్య పండితులు చెబుతునన్నారు.  పితృ దేవతల ఆశీస్సులు పుష్కలంగా ఉంటే జీవితంలో సాధించలేనిది ఏమీ ఉండదని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు అన్నం, పోషణ, మనస్సు, జీవశక్తి …సోమ తత్వాన్ని  సూచిస్తాడు.
శరీరంలోని జఠరాగ్ని (జీర్ణ శక్తి) తో సంబంధం ఉందని  సంప్రదాయాలు చెబుతున్నాయి. పితృ ఋణం, పూర్వీకుల ఆశీర్వాదం, మనస్సు శుద్ధి కోసం చేసే కాలంగా భావిస్తారు.

పరిహారాలు:

  • పితృ తర్పణం
  • పూర్వీకుల స్మరణ
  • దానం, అన్నదానం
  • రావి చెట్టు (అశ్వత్థం) ప్రదక్షిణ
  • జపం, ఉపవాసం

సోమవతి అమావాస్య అనేది మన పిత్రు దేవతలను .. మన జన్మ  మూలాలను గుర్తు చేసుకునే రోజు . కావున ఆరోజు పితృదేవతలను సంతృప్తి పరచి, పూర్వ పుణ్యాన్ని బలపరిచేందుకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.