
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్ సీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
మొత్తం ఖాళీలు:17.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ (ఇంజినీరింగ్) పూర్తిచేసి ఉండాలి. సీఎస్ఐఆర్– యూజీసీ నెట్, గేట్, జేఏఎం, జేఈఎస్టీ వంటి జాతీయ పరీక్షలో క్వాలిఫై అయి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 12.
లాస్ట్ డేట్: జులై 11.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.isro.gov.inను సందర్శించండి.