Reading Time: < 1 minute

తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం.. ఇంట్లో ACB సోదాలు.. రూ.5 కోట్లు దొరికినయ్ !

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్లోని పాత బస్తీ ఛత్రినాకలో ల్యాండ్స్ & సర్వే (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరి సోదరుడు వేణు ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. నరహరి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల వరకు అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ల్యాండ్స్ & సర్వే (మల్టీ జోన్-2) డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరి నివాసంలో, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ACB డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో.. ఛత్రీనాకలోని నరహరి ఇంటితో పాటు నారాయణగూడలోని ఆయన కార్యాలయం.. ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ దాడులు జరిగాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని 11 చోట్ల ఈ సోదాలు జరిగాయి. 

►ALSO READ | నేను వద్దంటే ప్రాజెక్టులు ఆగవ్.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

నరహరికి సంబంధించి.. భారీ మొత్తంలో ఉన్న బ్యాంక్ డిపాజిట్ల వివరాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులపై ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. నరహరిని మంగళవారం అరెస్ట్ చేస్తామని ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.