
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రకాశం జిల్లాలోని కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 16, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులు 7 వరకు ఉన్నాయి. ఎలాటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 17న ఈ కింది అడ్రస్‌లో జరిగే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులను గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, జనరల్ సర్జరీ, అనస్థీషియాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ డిప్లొమా లేదా ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీఈ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఈ కిండి అడ్రస్‌లో జూన్ 17, 2026వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు రూ.1,10,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు రూ.61,960 వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్..
జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.