పచ్చికారం టమాటా పచ్చడి : నాలుగు పెద్ద టమాటాలు, మూడు టేబుల్ స్పూన్స్ పచ్చి కారం, 10 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.
పచ్చికారం టమాటా పచ్చడి తయారి విధానం : ముందుగా పండు టమాటాలను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే పచ్చి కారాన్ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అది బాగా ఎండు మిర్చి వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. మిర్చిలు రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
పచ్చికారం టమాటా పచ్చడి తయారి విధానం స్టెప్ 1: ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో కట్ చేసుకున్న చిన్న టమాటా ముక్కలను తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, ఇంకా పసుపు కూడా వేసి బాగా కలపాలి. అలాగే ఈ టమాటాలు బాగా మెత్తబడే వరకు దానిలో ఉన్న నీరు పోయేంత వరకు బాగా వేయించాలి. టమాటాలు మెత్తగా ఉడికితే పచ్చడి బాగుంటుంది. అలాగే, ఇప్పుడు చింతపండును నీటిలో నానబెట్టి దానికి నుంచి గుజ్జు వేరు చేయాలి.
పచ్చికారం టమాటా పచ్చడి తయారి విధానం స్టెప్ 2: ఇక ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుని వేయించిన ఎండు మిర్చి, పచ్చి కారం, వేయించిన పండు టమాటాలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, రుచికి తగినంత కూడా ఉప్పు వేసి రుబ్బుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉంటే రుచిగా ఉంటుంది.
ఇక ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడిచేయాలి. అది వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, ఇంకా కొంచం జీలకర్ర కూడా వేసి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, 10 కరివేపాకు, ఇంకా ఇంగువ కూడా వేసి తాలింపు చేసి గ్రైండ్ చేసుకున్న పచ్చడిపై మీద పోయాలి.




