
హైదరాబాద్సిటీ, వెలుగు: మూసీ కారిడార్ ప్రాజెక్టులో మూసీపై మేజర్ బ్రిడ్జికి మార్గం సుగమమైంది. దీని నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ సోమవారం జీవో విడుదల చేసింది. నార్సింగిలోని ఔటర్ కు మూసీ పై నిర్మించే ఈ బ్రిడ్జిని లింక్ చేయాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది.
భూసేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా.. గండిపేట మండలంలోని మంచిరేవుల గ్రామం సర్వే నంబర్476, 508 లో భూసేకరణ అవసరం లేకుండానే బ్రిడ్జి నిర్మించేందుకు జీవో ఇచ్చింది. దీనివల్ల వెస్ట్ సిటీలోని నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది.