
సోషల్ మీడియా పరిచయం, ఆపై రాష్ట్రాలు దాటిన ప్రేమ వివాహం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఊర్మిళకు, తాడేపల్లికి చెందిన నాగరాజుకు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో.. పెద్దల సమక్షంలో ఐదు లక్షల కట్నం, బంగారం ఇచ్చి వివాహం జరిపించారు. తాడేపల్లిలో కాపురం పెట్టిన కొద్దిరోజులకే.. నాగరాజుకు అంతకుముందే రెండు వివాహాలై, విడాకులైనట్లు ఊర్మిళ గుర్తించింది. దీనిపై భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో, నాగరాజు బంధువులు కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఊర్మిళ పట్టుబట్టి, తన తల్లితో కలిసి వేరే అద్దె ఇంట్లోకి మారింది. అయితే, గత నాలుగైదు రోజుల నుంచి ఊర్మిళను, ఆమె తల్లిని బయటకు రాకుండా నాగరాజు గదిలో నిర్బంధించాడు. వారికి కనీసం అన్నం కూడా పెట్టకుండా నరకం చూపించాడు. బాధితుల ఆకలి కేకలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను విడిపించి స్టేషన్‌కు తరలించారు. నిందితుడు నాగరాజును విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. భర్త వేధింపులు తట్టుకోలేక, తమ సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్ళిపోతామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా! అంబానీ కోడలు రాధిక ఏం చెప్పారో తెలుసా?