Reading Time: < 1 minute
Gold Prices: బంగారం ధరలు మరోసారి డౌన్.. ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం ధరలపై గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు మళ్లీ శాంతించాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన ధరలకు బ్రేక్ పడింది. రెండు రోజుల్లో గోల్డ్ రేట్లు రూ.3 వేలు పెరగ్గా.. వెండి రూ.10 వేలు పెరిగింది. అనంతరం సోమవారం ధరలు తగ్గుముఖం పట్టి రిలీఫ్ ఇచ్చాయి. వారం ప్రారంభంలోనే ధరలు పడిపోవడంతో కొనుగోలుచేసేవారు ఊరట చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో డీల్ కదిరినట్లు ప్రకటించడంతో పాటు త్వరలోనే శాంతి ఒప్పందం చేసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా డాలర్‌ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెరుగుదల అంచనాల క్రమంలో బంగారం, వెండి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

గోల్డ్ రేట్లు ఇలా..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,070 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,640 వద్ద ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల రేటు రూ.1,49,070 వద్ద ప్రస్తుతం ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,640గా ఉన్నాయి.

-చెన్నైలో 10 గ్రామలు 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు రూ.1,51,190 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,590 వద్ద ఉన్నాయి.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,070 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,640 వద్ద కొనసాగుతున్నాయి

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.1,48,580గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,200గా ఉన్నాయి.

-ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,070 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,640గా కొనసాగుతున్నాయి.

-ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,49,220 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,790గా ట్రేడవుతోంది.

వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..?

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,69,900గా ఉంది.

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,69,900 వద్ద కొనసాగుతోంది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.2,59,900గా ఉంది.

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది