Reading Time: < 1 minute

కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం..కూలిన అమెరికా సైనిక విమానం

Caption of Image.

కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం జరిగింది.అమెరికా వైమానిక  దళానికి చెందిన   బి52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబార్ విమానం  మొజావే ఎడారిలో కూలిపోయింది.  ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న  ఎనిమిది సిబ్బంది చనిపోయారు. మొజావో ఎడారిలో రాడార్ మోడిఫికేషన్ లో భాగంగా  టెస్టింగ్ మిషన్ నిర్వమిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే  విమానం కూలిపోయింది.

రెగ్యులర్ టెస్టింగ్ మిషన్‌లో ఉన్న ఆ విమానం..లాస్ ఏంజిల్స్‌కు ఈశాన్యంగా ఉన్న సైనిక స్థావరం సమీపంలో కూలిపోయింది. సుమారుగా సోమవారం (జూన్ 14) ఉదయం 11:20 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  కుప్పకూలింది.  ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది స్పాట్ లో చనిపోయారు.. మృతదేహాల వెలికితీత కొనసాగుతుందని ఎడ్వర్డ్స్ ఎయిర్  బేస్ ధృవీకరంచింది. 

B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనేది US వైమానిక దళంలో ఇప్పటికీ క్రియాశీలకంగా సేవలో ఉన్న అత్యంత పురాతన విమానాలలో ఒకటి. 1955లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన ఈ సుదూర ప్రయాణ భారీ బాంబర్, అమెరికా వ్యూహాత్మక ఆయుధాగారంలో ఓ కీలక భాగం. 

©️ VIL Media Pvt Ltd.