
NEET-2026 రీ-ఎగ్జామ్ ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నీట్ పరీక్ష పూర్తయ్యే వరకు టెలిగ్రామ్ బ్యాన్ చేసింది కేంద్రం. నీట్ పరీక్ష జూన్ 21 ఉండగా.. జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పేర్కొంది.
- ఎడిటింగ్ ఫీచర్ డిజేబుల్:
అంతే కాకుండా టెలిగ్రామ్ యాప్ లో మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది. జూన్ 30 వరకు టెలిగ్రామ్ ఎడిటింగ్ ఆప్షన్ అందుబాటులో లేకుండా చేసినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
నీట్ ఎగ్జామ్ పేపర్ లీకయ్యాక.. రీఎగ్జామ్ కు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. రెండో సారి కూడా పేపర్లు లీకయ్యాయని.. డబ్బులు ఇస్తే కొశ్చన్ పేపర్స్ పంపిస్తామని ఫేక్ మెసేజెస్ టెలిగ్రామ్ గ్రూపులలో సర్కిలేట్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థులను తప్పుదోవ పట్టించే గ్రూపులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
The National Testing Agency (NTA) has welcomed the Ministry of Electronics and Information Technology’s directions restricting Telegram access in India until June 22, 2026, ahead of the NEET (UG) 2026 re-examination on June 21.#NTA #NEET #Telegram pic.twitter.com/F1KydMj564
— Press Trust of India (@PTI_News) June 16, 2026