Reading Time: 2 minutes

పోలీసులే హత్యలు, దొంగతనాలకు పాల్పడితే? ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢం’!

Caption of Image.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే సస్పెన్స్ సినిమాలంటే ఆడియన్స్‌కు ఒక రేంజ్ పిచ్చి.  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘దృశ్యం’ సిరీస్  దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా నిర్మించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢం’ (Dridam). థియేటర్లలో మే 8న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ హాట్ స్టార్ లో దూసుకుపోతుంది.

కథేంటంటే..

విజయ్ రాధాకృష్ణన్ (షేన్ నిగమ్) అనే ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ పోలీస్ ఆఫీసర్‌కు లైఫ్‌లో ఫస్ట్ పోస్టింగ్ వస్తుంది. అదీ ఎక్కడో కొండ ప్రాంతంలో, క్రైమ్ రేట్ అస్సలు లేని ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా. ఇక లైఫ్ అంతా హ్యాపీ, హాయిగా డ్యూటీ చేసుకోవచ్చు”అని విజయ్ ఫిక్స్ అయిన తరుణంలోనే అసలైన ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది.

అక్కడ అడవిలో ఒక కుళ్ళిపోయిన శవం బయటపడుతుంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే లోకల్ బ్యాంక్‌లో భారీ రాబరీ జరుగుతుంది. వెనువెంటనే మరో రెండు ఘోర హత్యలు. దాంతో ఆ ఏరియా ఒక్కసారిగా వణికిపోతుంది. కొత్తగా వచ్చిన యంగ్ ఆఫీసర్ విజయ్‌పై అటు పబ్లిక్, ఇటు డిపార్ట్‌మెంట్ నుంచి విపరీతమైన ప్రెజర్ పెరుగుతుంది. అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? బ్యాంక్ దోపిడీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? చుట్టూ ఉన్న ఇంటిదొంగలను దాటుకుని విజయ్ ఈ కేసును ఎలా ఛేదించాడు? అనేదే ఈ ‘దృఢం’ కథ.

నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్

ఈ సినిమాకు మోస్ట్ పవర్‌ఫుల్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా హీరో షేన్ నిగమ్. కొత్తగా జాయిన్ అయిన పోలీస్ ఎదుర్కొనే టెన్షన్, భయం, అమాయకత్వాన్ని తన బాడీ లాంగ్వేజ్‌తో అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తాను నమ్మిన పోలీసులే మోసం చేశారని తెలిసినప్పుడు ఆయన పండించిన మిక్స్డ్ ఎమోషన్స్ థ్రిల్ ఇస్తాయి. శోభి తిలకన్, దినేష్ ప్రభాకర్ తమ సపోర్టింగ్ రోల్స్‌తో కథను బాగా నిలబెట్టారు.

►ALSO READ | Sanchita Ugale: ఇండస్ట్రీని కుదిపేసిన నటి సంచిత సూసైడ్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ఆ 20 నిమిషాల విధ్వంసం.

సినిమా స్టోరీ లైన్ మొదట్లో సింపుల్‌గా అనిపించినా.. క్లైమాక్స్ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది. ఎవరూ ఊహించని విధంగా పోలీసులతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఈ క్రైమ్‌లో భాగమని తెలిసినప్పుడు మైండ్ బ్లాంక్ అవుతుంది. ‘ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు’ అనే సామెతను గుర్తుచేస్తూ వచ్చే వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్ అరాచకం. హత్యలకు, బ్యాంకు దోపిడీకి పోలీసులే పాల్పడటం అసలు ట్విస్ట్ గా నిలుస్తోంది.

 స్లో నేరేషన్.. రొటీన్ ఫార్ములా..

మలయాళ సినిమాల రెగ్యులర్ స్టైల్‌లోనే ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్‌లో చాలా స్లోగా సాగుతుంది. కొన్ని సీన్లు పాత ఇన్వెస్టిగేషన్ సినిమాలను గుర్తుచేస్తాయి. డైలాగ్స్ కూడా కొన్నిచోట్ల ప్రేక్షకుడికి స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నట్లు విడమర్చి చెప్పడం కాస్త బోర్ కొట్టిస్తుంది. జీతూ జోసెఫ్ గత చిత్రం ‘తుడురమ్’ తరహాలోనే ఇందులోని హత్యల వెనుక ఉన్న రీజన్ కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. సినిమా అంతటా మెయింటైన్ చేయాల్సిన సస్పెన్స్ ఇంటెన్సిటీని డైరెక్టర్ మార్టిన్ కేవలం క్లైమాక్స్‌కే పరిమితం చేయడం మైనస్.

మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

సాయిల్ సాజి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సెకండ్ హాఫ్‌లోని చాలా సీన్లను నెక్ట్స్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ హిల్ స్టేషన్ మూడ్‌ను పక్కాగా క్యాప్చర్ చేసింది.  కొన్ని సాగదీత సీన్లు ఉన్నప్పటికీ.. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఆ బోర్ మొత్తాన్ని మాయం చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఇంట్లో హాయిగా కూర్చుని చూడదగ్గ ఒక పర్‌ఫెక్ట్ వన్-టైమ్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్ ఈ ‘దృఢం’ అని సినీ ప్రేక్షకులు అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.