
స్లోవేకియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రధాని మోదీకి స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఘనస్వాగతం లభించింది. స్లోవేకియా సైన్యం గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. భారత్ , స్లోవేకియా మధ్య పలు రంగాల్లొ కీలక ఒప్పందంపై జరిగింది. ప్రధాని మోదీ , స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో సమక్షంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత్, స్లోవేకియా మధ్య దశాబ్ధాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ. రక్షణ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. భారత్‌లో పర్యటించాలని స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోను మోదీ ఆహ్వానించారు. కాగా.. ఈ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.. స్లోవేకియా తన అత్యున్నత పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (1వ శ్రేణి)’ని ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. కాగా, ఈ పురస్కారంతో ప్రధాని మోదీ పలు దేశాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 33కి చేరింది. అంతకుముందు ప్రధాని మోదీ 32 అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. అంతేకాకుండా.. స్లోవేకియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.
స్లోవాక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
బ్రాటిస్లావాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత రాష్ట్ర పురస్కారమైన “ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్”ను ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవానికి గాను ప్రధానమంత్రి, స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పురస్కారాన్ని స్వీకరిస్తూ, ఈ గౌరవం భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు, భారతదేశం-స్లోవేకియా మధ్య ఉన్న శాశ్వత స్నేహ బంధాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారతదేశం – స్లోవేకియా ప్రజలను ఏకం చేసే ఆత్మీయత, నమ్మకం, అనురాగానికి ఈ పురస్కారం ఒక నిదర్శనమని అభివర్ణిస్తూ, ఇరు దేశాల భవిష్యత్ తరాలు తమ ప్రత్యేక స్నేహాన్ని కొనసాగించడానికి ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Honoured to receive The Order of the White Double Cross (1st Class) in Bratislava this evening. My gratitude to the people and Government of Slovakia for this honour, which belongs to the 140 crore people of India. I dedicate this award to the enduring friendship between India… pic.twitter.com/FXs96XremQ
— Narendra Modi (@narendramodi) June 15, 2026
ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం..
#WATCH | Slovakia confers its highest honour, The Order of the White Double Cross (1st Class) on PM Narendra Modi. Slovakian President Peter Pellegrin presents him with the honour. This is the 33rd global honour bestowed by a country upon PM Modi.
The Order of the White Double… pic.twitter.com/wACOa3zMoc
— ANI (@ANI) June 16, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..