Reading Time: < 1 minute

గల్ఫ్ బాధితులకు అండగా ఉంటాం  : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

Caption of Image.

కొడిమ్యాల/మల్యాల, వెలుగు: గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ నెల 7న దుబాయ్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు గల్ఫ్ కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ సలీం కూడా ఉన్నాడు. ఎమ్మెల్యే దుబాయ్ వెళ్లి అక్కడి అధికారులతో చర్చించి డెడ్‌‌బాడీలను తీసుకురావడంలో కృషి చేశారు. ఆదివారం మధ్యాహ్నం సలీం డెడ్‌‌బాడీ తీసుకురాగా.. కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.20వేలు తక్షణ సాయంగా అందజేశారు.  

గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం 

దుబాయ్‌‌ రోడ్డు ప్రమాదంలో మల్యాల మండలం తక్కల్లపల్లికి చెందిన గొల్లపల్లి తిరుపతి (23) చనిపోగా.. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులను ఓదార్చారు. రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఇదే ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న ముత్యంపేటకు చెందిన మహమ్మద్ సయ్యద్ కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.20 వేలు సాయం అందజేశారు. మార్కెట్ చైర్మన్ మల్లీశ్వరి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, లీడర్లు ఆనందరెడ్డి, శంకర్ గౌడ్, ఆదిరెడ్డి, పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.