Reading Time: 2 minutes

తెలంగాణలో నెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేది  బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ లక్ష్మణ్

Caption of Image.
  • దేశంలో మొదట సీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోరీ చేసింది కాంగ్రెస్సే
  •     రాష్ట్రంలో ఇదే చివరి కాంగ్రెస్ సర్కారు
  •     రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలన అంతా అవినీతి, అబద్ధాలని విమర్శ
  •     తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై 
  • ఎక్కడైనా చర్చకు సిద్ధమని వెల్లడి ​

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎన్నికల్లో సీట్ చోరీ, ఓటు చోరీ అంటూ బీజేపీపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎంపీ లక్ష్మణ్‌‌‌‌ అన్నారు. అసలు దేశంలో మొదటి సీటు చోరీ చేసింది నెహ్రూ, కాంగ్రెస్సే​అని, స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ నాయకులంతా సర్దార్ పటేల్ మొదటి ప్రధాని కావాలని కోరుకున్నారని పేర్కొన్నారు. కానీ, ప్రజా ప్రతినిధుల ఆమోదం లేకపోయినా.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి నెహ్రూను ప్రధానిని చేశారని ఆరోపించారు.

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇదే చివరి కాంగ్రెస్ ప్రభుత్వమని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 4,399 రోజులకు పైగా ప్రజాస్వామ్యబద్ధంగా దేశానికి సేవ చేసి నెహ్రూ రికార్డును బద్ధలు కొట్టారని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అయితే.. ఎలాంటి బ్యాక్‌‌‌‌గ్రౌండ్ లేకుండా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రధాని అయిన వ్యక్తి మోదీ అని కొనియాడారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కోర్టులు సైతం సమర్థించాయని, కానీ కాంగ్రెస్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాద్ధాంతం చేస్తోందని అన్నారు.

కాంగ్రెస్‌‌‌‌.. అవినీతికి కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌

కాంగ్రెస్ పార్టీ.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని, మోదీ గడిచిన 12 ఏండ్లలో అవినీతి రహిత పాలనను అందించి దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచారని లక్ష్మణ్‌‌‌‌ చెప్పారు.  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని, 81 కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తూ ఆకలి చావులు లేని భారత్‌‌‌‌ను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే మోదీ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అబద్ధాల, అవినీతి పాలనకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కుటుంబం కోసం పనిచేస్తుంటే.. బీజేపీ దేశం కోసం పనిచేస్తోందని తెలిపారు. వచ్చే 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయని, అప్పుడు తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని పేర్కొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.