Reading Time: < 1 minute

టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్‎పై కోడిగుడ్లతో దాడి

Caption of Image.

కోల్‎కతా: పశ్చిమబెంగాల్‎లో ప్రతిపక్ష టీఎంసీ నేతలపై దాడుల  పర్వం కొనసాగుతోంది. ఇటీవలే ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా టీఎంసీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్‎పై కోడి గుడ్లతో చేశాడో ఓ వ్యక్తి. సోమవారం (జూన్ 15) పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం నుంచి కునాల్ ఘోష్ బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 

చందన్ అనే స్థానిక యువకుడు ఈ దాడికి తానే బాధ్యుడినని ప్రకటించుకున్నాడు. ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన చందన్ దాడిని సమర్థించుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ నేతలు సామాన్య ప్రజలపై ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నాడు. కునాల్ ఘోష్ కూడా తక్కువేమీ కాదన్నాడు. టీఎంసీ మాకు చాలా అన్యాయం చేసిందని.. ఈ దాడులకు వాళ్లు అర్హులేనన్నాడు. ఏకంగా మమత బెనర్జీ ఇంటి ముందే టీఎంసీ సీనియర్ నేతపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీఎంసీ ఇప్పటి వరకు స్పందించలేదు. 

►ALSO READ | కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై దాడి.. చెంప చెల్లుమనిపించిన దుండగులు

©️ VIL Media Pvt Ltd.