Reading Time: 2 minutes
12 = 6, 6 = 3.. అయితే 10 = 5 ఎందుకు కాదు? మీ బుర్ర వేడెక్కే చిక్కు ప్రశ్న

ఒక పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుంటాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా దొంగను పట్టుకోలేకపోతున్నారు. చివరకు ఆ కేసును ఒక తెలివైన ఓ డిటెక్టివ్‌కు అప్పగిస్తారు. దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్‌కు ఒక కీలక సమాచారం లభిస్తుంది. దొంగ ఒక పాత భవనంలో దాక్కున్నాడని తెలుస్తుంది. వెంటనే అతను ఆ భవనానికి చేరుకుంటాడు.

ఆ భవనం ద్వారం వద్ద ఓ వ్యక్తి ఉంటాడు. అతడు కోడ్‌ ల్యాంగ్వేజ్‌లో అడిగే ప్రశ్నలకు.. లోనికి ప్రవేశించేవారు సరైన సమాధానం చెబితేనే ద్వారం తెరుస్తాడు. లేదంటే లోనికి ఎవరినీ అనుమతించడు. అలా మొదట వ్యక్తి ద్వారం వద్దకు రాగానే ద్వారం వద్ద కాపలా ఉన్న వ్యక్తి 12 అని అంటాడు. బయట ఉన్న వ్యక్తి సమాధానం 6 చప్పగానే ద్వారం తెరుస్తాడు. రెండో వ్యక్తికి 6 అని కాపలా ఉన్న వ్యక్తి చెబితే.. ఆ వ్యక్తి 3 అని సమాధానం చెబుతాడు. అతడినీ లోనికి అనుమతిస్తాడు. ఇదంతా గమనించిన డిటెక్టివ్ వారికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, వారి సమాధానం ఏం చెబుతున్నారో నంబర్లను మాత్రమే గమనిస్తాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత వెంటనే అతడు కూడా ద్వారం వద్దకు చేరుకుంటాడు. ద్వారం వద్ద ఉన్న కపలా వ్యక్తి 10 అని చెప్పగానే.. వెంటనే డిటెక్టివ్‌ 5 అని సమాధానం చెబుతాడు. దీంతో కాపలా వ్యక్తి తప్పు ఆన్సర్‌ అని ద్వారం మూసేస్తాడు. ఎందుకు..? ఇదే చిక్కుప్రశ్న..

ముగ్గురి సమాధానాలు గణితపరంగా సరైనవి.. కానీ లాజిక్‌ అదికాదు

  • 12 – 6 = 6
  • 6 – 3 = 3
  • 10 – 5 = 5

ఎందుకంటే ఇక్కడ గణిత లెక్కలు కాదు మేధస్సు వాడాలి. సమాధానం ఏమంటే..?

మొదటి వ్యక్తిని 12 అనిడిగితే సమాధానం 6 అని చెబుతాడు. TWELVE అనే ఆంగ్ల పదంలో 6 అక్షరాలు ఉన్నాయి.
రెండో వ్యక్తిని 6 అని అడిగితే.. అతడు 3 అని సమాధానం చెబుతాడు. SIXఅనే ఆంగ్ల పదంలో 3 అక్షరాలు ఉన్నాయి.
ఈ లాజిక్ ప్రకారం 10 అనే ప్రశ్నలకు.. TEN అనే పదంలో కేవలం 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. సమాధానం 3కి బదులు 5 చెప్పడంతో డికెట్టివ్‌ పట్టుబడతాడు.

లాజిక్ ఇదే..

  • TWELVE → 6 అక్షరాలు
  • SIX → 3 అక్షరాలు
  • TEN → 3 అక్షరాలు (కానీ డిటెక్టివ్‌ తప్పు చెప్పాడు)

ఇక కోడ్‌ నంబర్ అనేది ఆంగ్ల సంఖ్యా పదంలోని అక్షరాల సంఖ్యను సూచిస్తోంది. అంటే డిటెక్టివ్‌ చెప్పిన సమాధానం ఈ క్రమానికి సరిపోవడం లేదు. అందుకే డిటెక్టివ్ మిగతావారితో పోలిస్తే భిన్నంగా సమాధానం చెప్పడంతో దొంగలకు దొరికిపోయాడు. ఈ రకమైన చిక్కు ప్రశ్నల్లో పెద్ద క్లూలు అవసరం ఉండవు. చిన్న లాజిక్ తప్పు లేదా అసంగతత (inconsistency)నే సమాధానానికి దారి తీస్తుంది.