Reading Time: < 1 minute
Prabhas Cameo In Pawan Kalyans Og

రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా? అంటే అవుననే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’కి సీక్వెల్‌గా ‘OG 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుజీత్ మరో 10 రోజుల్లో ఇండియాకు తిరిగి రానున్నారు. సుజిత్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్‌తో ‘OG 2’ కథపై చర్చలు జరపబోతున్నారట.

ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫైనల్ నరేషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని పవర్ స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.. ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. అయితే ‘OG 2’ కథకు, ప్రభాస్ హీరోగా సుజీత్ గతంలో తెరకెక్కించిన ‘సాహో’ చిత్రానికి ఇంటర్‌లింక్ ఉందనే విషయాన్ని పార్ట్ వన్‌లో చెప్పేశాడు సుజీత్. ఇక ఇప్పుడు ఓజీ 2లో ప్రభాస్ ఏకంగా పవర్‌ఫుల్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. కానీ, సుజీత్ సృష్టించబోయే ఈ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలె పవర్ స్టార్ టీమ్ ఈ సినిమాను కన్ఫర్మ్ చేయగా.. సెప్టెంబర్‌లో అనౌన్స్ చేసి.. నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఓజీ 2లో ప్రభాస్ కనిపిస్తే.. మామూలుగా ఉండదనే చెప్పాలి.