సాధారణంగా ఈ ఫ్లైట్ మోడ్ అనేది మన మొబైల్‌కు వచ్చే అన్ని వైర్లెస్ సిగ్నిల్స్‌ను ఆపేస్తుంది. అయితే ఎక్కడైనా నెట్వర్క్ సరిగ్గా రాకపోతే..మన ఫోన్ సిగ్నల్ కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అలాంటి సమయంలో ఈ ఏర్ప్లేన్ మోడ్‌ను మీకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా, సిగ్నల్ వెతికే ప్రక్రియ ఆగిపోయి బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతుంది.
సాధారణంగా చాలా మంది ఫోన్ ఛార్జ్ చేసేప్పుడు మొబైల్లో ఇంటర్నెట్, లోకేషన్ ఇలా అన్నింటింని ఆన్‌లో ఉంచుతారు. కానీ మీ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయాలనుకునేంటే.. ఎర్ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఫోన్ నెట్వర్క్ సెర్చింగ్‌ను నిలిపివేసి.. ఫోన్ త్వరగా చార్జ్ అయ్యేందుకు సహాయపడుతుంది.ఈ మోడ్ ఆన్ చేయడం ద్వారా ఛార్జింగ్ వేగం సాధారణం కంటే 20 నుండి 25 శాతం పెరుగుతుందని చెబుతారు.
అలాగే మనం పిల్లలు ఆడుకోవడానికి లేదా వీడియోలు చూడటానికి ఫోన్ ఇచ్చే వాళ్లు ఏది పడితో అది నొక్కడ వల్ల ఫోన్ సెట్టింగ్స్ మారిపోయే లేదా ఇతరులకు కాల్స్ వెల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏర్ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి ఇవ్వడం మంచిది. ఇది మొబైల్ డేటాను నిలిపివేస్తుంది, తద్వారా పిల్లలు అనవసరంగా ఇంటర్నెట్ను ఉపయోగించకుండా నిరోధించవచ్చు. అలాగే పొరపాటున ఎవరికీ కాల్స్ వెళ్లకుండా చూసుకోవచ్చు.
సాధారణంగా సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు, ఫోన్ చాలా వేగంగా వేడెక్కడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏర్ప్లేన్ మోడ్‌ను ఆన్ చేస్తే, ఫోన్ నెట్వర్క్ కోసం వెతకడం ఆపేస్తుంది కాబట్టి ఫోన్ వేడెక్కకుండా చల్లబడుతుంది. అలాగే తర్వాత వచ్చే సిగ్నిల్ కూడా మీ ఫోన్‌కు త్వరగా కనెక్ట్ అవుతుంది. అలాగే అది స్పీడ్‌గా వస్తుంది.
చదువుకునేటప్పుడు లేదా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఏర్ప్లేన్ మోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంపార్ట్టెండ్ పనిలో ఉన్నప్పుడు ఈ మోడ్‌ను ఆన్ చేస్తే.. మీకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ, కాల్స్ కాని రాకుండా ఇది అడ్డుకుంటుంది. దీని వల్ల మీరు మీ పనిపై ఫోకస్ పెట్టగలుగుతారు.




