Reading Time: < 1 minute

గండిపేట భూముల కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మరో షాక్… పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశాలు…

Caption of Image.

హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసులో ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాలని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించారు. బ్రహ్మనాయుడును విచారించేందుకు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఈ మేరకు సోమవారం ( జూన్ 15 ) బ్రహ్మనాయుడును పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

పోలీసుల కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో మంగళవారం ( జూన్ 16 ) నుండి మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.

►ALSO READ | దక్షిణకాశీకి పోటెత్తిన భక్తులు.. శ్రీకాళహస్తీశ్వరుని ప్రాంగణం కిటకిట

ఇదిలా ఉండగా.. ఈ కేసులో బ్రహ్మనాయుడు బాధితుడిని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఏపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి బ్రహ్మనాయుడుపై కేసు పెట్టిందని అంటున్నారు. బ్రహ్మనాయుడు క్లీన్ చిట్ తో బయటికి వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
 

©️ VIL Media Pvt Ltd.