Reading Time: 2 minutes

సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్: సంచిత-సుశాంత్ మరణాల వెనుక ఒకే కారణమా? నటి సోదరుడి సంచలన ఆరోపణలు

Caption of Image.

22 ఏళ్ల టెలివిజన్ నటి సంచిత ఉగాలే (Sanchita Ugale) సూసైడ్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఆమె సోదరుడు ఆకాశ్ ఉగాలే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరిగానే తన సోదరి కూడా క్యాస్టింగ్’ వేధింపుల కారణంగానే ప్రాణాలు తీసుకుందని ఆయన ఆరోపించారు. సినీ ఇండస్ట్రీలోని కొంతమంది కాస్టింగ్ ఏజెంట్లు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేశారన్నారు. ముఖ్యంగా ఇద్దరి మరణాలు కూడా జూన్ 14నే, ఆరు సంవత్సరాల వ్యవధిలో జరగడం విషాదకర యాదృచ్ఛికమని పేర్కొన్నారు

అయితే సంచిత ఉగాలే ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు సైతం స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

సుశాంత్ మరణంతో పోల్చిన సోదరుడు!

లేటెస్ట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి సోదరుడు ఆకాశ్ ఉగాలే మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంచిత ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న వాళ్లు. అయితే, ఈ పరిశ్రమలోని కొంతమంది కొంతమంది కాస్టింగ్ ఏజెంట్ల వల్ల తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని ఆరోపించారు. అదే వారి మరణాలకు కారణమై ఉండవచ్చని’’ ఆకాష్ అభిప్రాయపడ్డారు.

‘2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకున్నారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒత్తిళ్లే దానికి కారణమయ్యాయి. అదే విధంగా నా సోదరి సంచిత కూడా అదే కారణాలతో ప్రాణాలు తీసుకుంది’ అని ఆకాష్ అన్నారు.

అంతేకాకుండా, సంచిత తన చివరి సోషల్ మీడియా పోస్టును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వర్ధంతికి అంకితం చేసిందని చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో “It’s again 14 June” అనే సందేశం ఉన్నట్లు వెల్లడించారు.

ప్రధాని మోదీ, రాష్ట్రపతికి విజ్ఞప్తి

ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జోక్యం చేసుకోవాలని ఆకాశ్ ఉగాలే విజ్ఞప్తి చేశారు. తన సోదరి మరణానికి సంబంధించిన ప్రతి కోణాన్ని అధికారులు పరిశీలించాలని ఆయన కోరారు.

ఆందోళనలో ఉండేది: నటుడు సోరబ్ బేడీ 

‘సాజన్ ఘర్’, ‘కుమ్‌కుమ్ భాగ్య’, ‘దిల్‌వాలి దుల్హా లే జాయేగీ’ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన సంచిత ఉగాలే జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ విషాద ఘటనపై ఆమె సహనటుడు, సన్నిహితుడు సోరబ్ బేడీ స్పందిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మనం కలవాల్సి ఉంది, మిత్రమాఅని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

అలాగే, సోరబ్ బేడీ మీడియాతో మాట్లాడుతూ, “మేము కేవలం రెండు రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఈ విషయం నాకు చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది. ఇటీవల కొద్ది రోజులుగా సంచిత మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నట్లు వెల్లడించారు. “పాపం.. ఆమె చాలా ఇబ్బందుల్లో, ఆందోళనలో ఉండేది” అంటూ సోరబ్ బేడీ విచారం వ్యక్తం చేశారు. “ఇది నాకు నిజంగా చాలా షాకింగ్ వార్త” అని అన్నారు.

ఇకపొతే, సోరబ్ బేడీ, సంచిత ఉగాలే ‘దిల్‌వాలి దుల్హా లే జాయేగీ’ సీరియల్‌లో కలిసి నటించారు. ఇందులో కార్తిక్, సుకూన్ పాత్రల్లో కనిపించిన ఈ జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీరి కెమిస్ట్రీకి మంచి స్పందన లభించడంతో టెలివిజన్ ప్రేక్షకుల్లో వీరిద్దరూ అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకరిగా నిలిచారు.

©️ VIL Media Pvt Ltd.