
ప్రతి రోజు ఏదో పని, ఎన్నో టెన్షన్లు.. అయినా కూడా కొంతమంది సినిమా చూస్తూనో, క్రికెట్ మ్యాచ్ చూస్తూనో అన్ని మర్చిపోయి అందులో లీనమై పోతారు. అయితే కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు.. ప్రపంచంలో ఏ మూల క్రికెట్ జరిగినా.. అందులో ఒక అద్బుతమైన షాట్, మంచి క్యాచ్, సూపర్ డెలవరీ, షార్ఫ్ ఫీల్డింగ్.. ఇలా ఏది గొప్పగా జరిగినా దాన్ని చూసి ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారికి మరింత సంతోషాన్ని ఇచ్చి వీడియో ఇది. ఆ షాట్ ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించక మానదు. అంత మంచి షాట్. పైగా కొట్టింది ఎవరో కాదు.. క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ స్మృతి మంధాన.
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో మంధాన ఓ సూపర్ సిక్స్ కొట్టింది. ఆ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. డౌన్ ది ట్రాక్ వస్తూ.. బాల్‌ను అద్బుతంగా పిక్ చేస్తూ.. లాంగ్ ఆన్‌లోకి ఎంత చూడముచ్చటగా కొట్టిందో.. ఆహా.. అలా ఎన్ని సార్లు అయినా చూడాలనిపిస్తోంది ఆ షాట్‌ను. సోషల్ మీడియాలో ఆ సిక్స్ వీడియో అయితే తెగ ట్రెండ్ అవుతోంది. ఆ షాట్ చూసిన అభిమానులు.. ఇందుకే కదా మంధానను క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనేది అంటూ మెచ్చుకుంటున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా సచిన్, కింగ్ ఆఫ్ ది క్రికెట్‌గా విరాట్, క్వీన్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్‌గా స్మృతి.. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చారు.
#SmritiMandhana dances down the track and puts that away for a maximum!
#TeamIndia are turning up the heat.
ICC Women’s #T20WorldCup 2026 | #INDvPAK | LIVE NOW
https://t.co/njSue0M5uR pic.twitter.com/gTyi8hdM6I
— Star Sports (@StarSportsIndia) June 14, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన 68, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు చేసి రాణించారు. చివరల్లో రిచా ఘోష్ 17 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేసి సూపర్ ఫినిష్ ఇచ్చింది. ఇక 171 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూసించారు. కేవలం 106 పరుగులకే ఆల్ అవుట్ చేసి పడేశారు. ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టింది. శ్రీ చరణి 3, షఫాలీ వర్మ ఒక వికెట్ తీసుకున్నారు. దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


