Reading Time: 2 minutes

ఈ పాన్ కార్డ్ రూల్స్ తెలియకపోతే అంతే సంగతులు.. ఆ తప్పు చేస్తే రూ.10వేలు ఫైన్

Caption of Image.

జేబులో ఉన్న PAN కార్డ్ కేవలం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మీరు ఇల్లు కొన్నా, బైక్ మార్చినా, చివరికి షేర్ మార్కెట్లో అడుగుపెట్టినా.. మీ వెనుక సైలెంట్‌గా వాచ్ చేసే విలన్ లాంటిది ఈ పాన్ కార్డ్. పాన్ నంబర్ ఇవ్వకపోతే లేదా తప్పుగా ఇస్తే.. మీ ఫైనాన్షియల్ లైఫ్ రిస్క్‌లో పడటం ఖాయం. పాన్ కార్డ్ తప్పనిసరి అయిన 5 సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ఈ 5 లావాదేవీల్లో ‘పాన్’ తప్పనిసరి..
టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రతి హై-వాల్యూ ట్రాన్సాక్షన్‌ను ట్రాక్ చేయడానికి పాన్ కార్డును ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతోంది. ముఖ్యంగా ఈ 5 పనులకు పాన్ నంబర్ ఖచ్చితంగా చెప్పాల్సిందే:

1. ఇల్లు/స్థలం: రూ.20 లక్షలు దాటిన స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు పాన్ తప్పనిసరి.
2. షాపింగ్ & సర్వీసెస్: ఒకేసారి రూ.2 లక్షలు దాటి వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేస్తే.
3. అన్‌లిస్టెడ్ షేర్లు: రూ.లక్ష దాటిన అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్‌కు.
4. బైక్స్ & కార్లు: రూ.5 లక్షలు దాటిన మోటార్ వెహికల్స్ కొనేటప్పుడు.
5. ఇన్వెస్ట్‌మెంట్స్: డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసినా పాన్ డిటైల్స్ తప్పనిసరి.

2. ఐటీ నోటీసుల టెన్షన్..
“నేను పాన్ కార్డ్ నంబర్ ఇచ్చేసాగా.. నాకేం కాదు” అని రిలాక్స్ అవ్వకండి. మీరు పాన్ కార్డ్ సబ్‌మిట్ చేయగానే.. ఆ డేటా మొత్తం TDS/TCS, SFT, AIS సిస్టమ్స్‌లోకి వెళ్లిపోతుంది. మీరు ఐటీ రిటర్న్స్‌లో చూపించిన ఆదాయానికి, పాన్ కార్డ్ హిస్టరీలో ఉన్న ఖర్చులకు గనుక తేడా వస్తే.. ఐటీ శాఖ నుంచి ఆ డబ్బు ఎక్కడిది? అంటూ నోటీసులు రావడం గ్యారెంటీ.

3. ఒక్క తప్పు.. రూ.10వేలు ఫైన్
తెలిసో, తెలియకో తప్పుడు పాన్ నంబర్ ఇచ్చారా.. ఇక అంతే సంగతులు. రూల్స్ ప్రకారం తప్పుడు పాన్ నంబర్ ఇస్తే రూ.10వేలు పెనాల్టీ విధిస్తారు. దీంతో పాటు మీ టాక్స్ క్రెడిట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఐటీ డిపార్ట్‌మెంట్ నిఘా మీపై మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి. 

ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే.. తాజా ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ‘ఫామ్ నెం. 97’ ఉపయోగించవచ్చు. కానీ ఇది అన్ని చోట్లా పని చేయదు. కొన్ని లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరిగా తీస్కోవాల్సిందే. కాబట్టి బాస్.. లావాదేవీలు చేసేటప్పుడు పాన్ కార్డ్ వివరాలను కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. లేదంటే జేబు ఖాళీ అవ్వడంతో పాటు టాక్స్ అధికారుల నుంచి కష్టాలు స్టార్ట్ అవ్వటం ఖాయం. 

©️ VIL Media Pvt Ltd.