Reading Time: 2 minutes
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!

92 ఏళ్ల వయసులో చాలా మంది విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఇటలీకి చెందిన ఎమ్మా మారియా మాత్రం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మాజీ సైన్స్ టీచర్ ఇప్పటికీ అథ్లెట్‌గా పోటీల్లో పాల్గొంటూ తన వయసు వారికి అసాధ్యమనిపించే విజయాలను సాధిస్తున్నారు. ఆమె విజయాల కంటే శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్న విషయం ఆమె శారీరక సామర్థ్యం. ఎమ్మాపై నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 92 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఆమె శారీరక సామర్థ్యం 30 ఏళ్ల యువతి స్థాయిలో ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణుల దృష్టిని ఆకర్షించింది. మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను గ్రహించి కండరాలకు చేరవేసే వ్యవస్థ ఎమ్మా శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా కూడా యువతలో ఉండే స్థాయిలోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఎమ్మా ఎలాంటి కఠినమైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను అనుసరించడం లేదు. వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే వ్యాయామం చేస్తారు. ఒక్కోసారి గంటలోపే ఆమె వర్కౌట్ పూర్తవుతుంది. ఆమె రొటీన్‌లో కొద్దిసేపు జాగింగ్, కొద్దిసేపు పరుగు, రోజువారీ నడక, తేలికపాటి వ్యాయామాలు ఉంటాయి. చాలా మంది అనుకునేలా గంటల తరబడి జిమ్‌లో గడపడం లేదా ఎక్కువ దూరం పరుగులు తీయడం ఆమెకు అలవాటు లేదు. ఆహారం విషయంలో కూడా ఎమ్మా ఎలాంటి ప్రత్యేక డైట్‌ను పాటించరు. చేపలు, గుడ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. అదే సమయంలో తనకు ఇష్టమైన స్టీక్ వంటి ఆహారాన్ని కూడా అప్పుడప్పుడు ఆస్వాదిస్తారు. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదని ఆమె జీవనశైలి చెబుతోంది. ఎమ్మా కథ అందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన డైట్‌లు, కఠినమైన వ్యాయామాలు మాత్రమే మార్గం కాదు. క్రమం తప్పని శారీరక చురుకుదనం, సమతుల్య ఆహారం, నిరంతర క్రమశిక్షణ ఉంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు

అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!

12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?

అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు చేసి.. కోట్లు సంపాదించాడు