Reading Time: < 1 minute

ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిని అరెస్ట్ చేసిన ACB.. ఆస్తుల చిట్టా చూస్తే మతి పోవాల్సిందే !

Caption of Image.

హైదరాబాద్: ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ భూరికార్డుల అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దాదాపు 16 గంటల పాటు ఏసీబీ అధికారుల సోదాలు జరిపారు. నరహరి ఇంట్లో రూ.1.54 కోట్ల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 

నరహరి బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ. 5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. కేజీ 300 గ్రాముల బంగారం, 8 కిలోల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరహరి ఆస్తుల చిట్టా చూస్తే సామాన్య జనం విస్తుపోవాల్సిందే.

రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో వ్యవసాయం భూమి, పుప్పాలగూడలో హైరైజ్ బిల్డింగ్, నార్సింగిలో రెండు హైరైజ్ బిల్డింగ్లు, రాజేంద్ర నగర్లో మరో హైరైజ్ బిల్డింగ్, గచ్చిబౌలిలో G+3 బిల్డింగ్, ఛత్రినాకలో G+2 బిల్డింగ్.. ఇలా దాదాపు 13 కోట్ల 5 లక్షల 67 వేల 100 రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నరహరి స్థిరాస్తుల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 13 కోట్లకు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగానే ఉండొచ్చని ఏసీబీ స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.