
- ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ఎస్టేట్లో ఓ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇండస్ట్రియల్ఎస్టేట్లోని వసంత్కెమికల్ఫ్యాక్టరీలోని పాత రియాక్టర్లతోపాటు చెత్తాచెదారాన్ని రోడ్డు పక్కన పడేశారు. మంగళవారం ఆ చెత్త నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, ఘాటైన వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కంపెనీ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. అవే మంటలు కెమికల్ఫ్యాక్టరీకి అంటుకొని ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని స్థానికులు తెలిపారు.
ఈ కంపెనీలో మండే స్వభావం ఉన్న ఉత్పత్తులు తయారవుతాయని, సంబంధిత వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేయడంతో కెమికల్ రియాక్షన్ జరిగి, మంటలు అంటుకున్నాయని ఆరోపించారు. పొల్యూషన్కంట్రోల్బోర్డు(పీసీబీ) అధికారులు స్పందించి, ఫ్యాక్టరీ వ్యర్థాల నిర్వహణపై తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు.