Reading Time: < 1 minute

హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తికి ఊరట

Caption of Image.
  • భూవివాదంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు నిలిపివేత

హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారంటూ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి అభినంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షావిలి, ఆయన సోదరుడు అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షావిలి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారికి ఉపశమనం లభించింది. వారికి చెందిన 3.26 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గతేడాది నవంబరు 6న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవాల్ చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుల్లా కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం విచారించారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. 

©️ VIL Media Pvt Ltd.