Reading Time: < 1 minute

నేను జర్మన్ నేర్చుకుంటున్నా…లాంగ్వేజ్ వస్తే లైఫ్ సెటిల్: మంత్రి వివేక్

Caption of Image.

గ్లోబల్ అవకాశాలను అందుకోవడానికి విదేశీ భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముఖ్యంగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా అక్కడి ప్రజలతో, కంపెనీలతో కనెక్టివిటీ పెరుగుతుందని, ఇది ఉపాధి మార్గాలను సులభతరం చేస్తుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ మాసబ్ టాంక్‌లోని టామ్‌కామ్ కార్యాలయంలో  తెలంగాణ ఓవర్ సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జర్మన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్’ కార్యక్రమం  నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. టామ్‌కామ్‌లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్న విద్యార్థులకు జర్మనీలో లభించే అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

భాషా నైపుణ్యం సాధించాలంటే విద్యార్థులకు వంద శాతం అటెండెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రతి రోజు కనీసం 2 గంటల పాటు విదేశీ భాషా పఠనాన్ని ప్రాక్టీస్ చేయాలని, అప్పుడే ఆ భాషపై పట్టు సాధించి విదేశాల్లో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోగలరని మంత్రి వివేక్ వెంకటస్వామి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి విద్యార్థులతో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్, ఉర్దూలోనే ఎక్కువగా మాట్లాడటం వల్ల నాకు మొదట్లో తెలుగు మాట్లాడటం కష్టంగా ఉండేది. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక పట్టుదలతో తెలుగు నేర్చుకున్నాను. అలాగే, ఇప్పుడు నేను మంత్రిగా ఉంటూనే.. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను అని ఆయన తెలిపారు. సరైన కమిట్‌మెంట్, బలమైన లక్ష్యం ఉంటే జర్మన్ భాషను సులభంగా నేర్చుకోవచ్చని విద్యార్థుల్లో భరోసా నింపారు.

©️ VIL Media Pvt Ltd.