Reading Time: < 1 minute
వానల్లోనూ షూటింగ్స్ జోరు.. లొకేషన్లలో బిజీగా స్టార్ హీరోలు

వర్షాలు ఊపందుకున్నాయి.. వాటితో పాటే మన హీరోలు జోరు పెంచేసారు.. ఎవర్ని చూసినా లొకేషన్‌లోనే కనిపిస్తున్నారు. వానొచ్చినా ఏమొచ్చినా షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చేదే లే అంటున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే.. అందరూ షూటింగ్స్‌తోనే బిజీ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచేసారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? ఎప్పట్లాగే ఈ వారం కూడా అల్యూమీనియం ఫ్యాక్టరీలో షూటింగ్స్ జాతర జరుగుతుంది. గోపీచంద్, వెంకట్ కాంబినేషన్‌లో వస్తున్న సింగతో పాటు.. రవితేజ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఇరుముడి కొత్త షెడ్యూల్స్ అక్కడే జరుగుతున్నాయి. అల్యూమీనియం ఫ్యాక్టరీ తర్వాత RFC కూడా అంతే బిజీగా ఉంది. అక్కడే ప్రభాస్ ఫౌజీ షూటింగ్ జరుగుతుంది. ఫౌజీతో పాటే స్పిరిట్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. దీని షూటింగ్ చర్లపల్లి జైల్లో జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతుంది. వారణాసి షూట్ శంషాబాద్ తాహెర్ స్టూడియోలో జరుగుతుండగా.. ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ 4 వారాలుగా RFCలో జరుగుతుంది. బాలయ్య, గోపీచంద్ మలినేని చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అలాగే నాగార్జున 100వ చిత్ర షూటింగ్ గచ్చిబౌలిలో.. వెంకటేష్ ఆదర్శ కుటుంబం షూట్ మోకిళ్లలో జరుగుతున్నాయి. శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు చిత్ర షూటింగ్ శంకరపల్లిలోనే 6 వారాలుగా జరుగుతుంది. మెగా 158 షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్‌ విషయాలు

92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!

శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు

అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!

12 రోజుల పాటు కదలని ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ? ఎప్పుడు?