Reading Time: < 1 minute
Sarpreet Singh Becomes First Indian Origin Player To Start Fifa World Cup Match

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026లో అరుదైన ఘనత చోటుచేసుకుంది. ఫిఫాలో స్టార్టింగ్ ఎలెవన్‌లో ఆడిన తొలి భారత మూలాలున్న ఫుట్‌బాలర్‌గా సర్‌ప్రీత్ సింగ్ రికార్డుకెక్కారు. న్యూజిలాండ్ తరుపున ఈయన బరిలో దిగారు. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటుదక్కించుకుని, మ్యాచ్‌ను ఆరంభించిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఆక్లాండ్‌లో పంజాబీ తల్లిదండ్రులకు జన్మించిన 27 ఏళ్ల సర్‌ప్రీత్ న్యూజిలాండ్ టీమ్‌లో మిడ్‌ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపుగా పూర్తి సమయం గ్రౌండ్ లోనే ఉన్నాడు.

సర్‌ప్రీత్ 2019లో జర్మనీ దిగ్గజ క్లబ్ బయోర్న్ మ్యూనిక్‌ తరుఫున బుండెస్లిగాలో ఆడిన తొలి భారతీయ మూలాలు ఉన్న ఆటగాడిగా పేరుత తెచ్చుకున్నాడు. నిజానికి సర్‌ప్రీత్ భారత అభిమానులకు కొత్త కాదు. 2018లో ముంబైలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో న్యూజిలాండ్ అండర్ 23 జట్టు తరుఫున భారత్‌పై ఆడాడు. ఆ టోర్నీలో కెన్యాపై గోల్ చేయడంతో పాటు భారత్‌పై విజయాన్ని అందించారు.

ఇదే ఫిఫా వరల్డ్ కప్‌లో మరో భారతీయ మూలాలు ఉన్న ఆటగాడు నిషాన్ వెలుపిళ్లై ఆస్ట్రేలియా తరుఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌ మాజీ మిడ్‌ఫీల్డర్ వికాష్ ధోరాసూ మాత్రమే భారత సంతతి నుంచి వరల్డ్ కప్‌లో ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందగా, ఇప్పుడు సర్‌ప్రీత్ స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించాడు.