Reading Time: < 1 minute

బొకే వద్దన్న సీఎం విజయ్.. ఆ డబ్బుతో ముగ్గురు పేద విద్యార్థినుల చదువులకు సాయం

Caption of Image.

తమిళనాడు సీఎం విజయ్‌ను హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నటుడు విశాల్ చేసిన పని ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. సీఎంను కలిసేందుకు తీసుకెళ్లిన సంప్రదాయ పూలగుచ్ఛం, శాలువాను విజయ్ స్వీకరించకపోవడంతో, వాటి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును మంచి పనికి వినియోగించాలని విశాల్ నిర్ణయించుకున్నారు. సీఎం విజయ్ పేరు మీద తమిళనాడుకు చెందిన ముగ్గురు నిరుపేద విద్యార్థినుల ఉన్నత చదువులకు స్పాన్సర్‌షిప్ ప్రకటించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విశాల్.. తాత్కాలికంగా ఉండే బొకే కంటే ఒక చిన్నారి విద్యకు సహాయం చేయడం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థినులు తమ కుటుంబాల్లో తొలి గ్రాడ్యుయేట్లు కావడం విశేషం. వారిలో ఒకరు బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), మరొకరు బీసీఏ, ఇంకొకరు బీకామ్ చదువుతున్నారు.

అనంతరం సీఎంతో భేటీ ఎంతో ఆత్మీయంగా జరిగిందని చెప్పారు. ఎన్నో విమర్శలు, సవాళ్లను మౌనంగా ఎదుర్కొంటూ విజయాన్ని సాధించారని కొనియాడారు. ముఖ్యమంత్రి పదవి వచ్చినా విజయ్‌ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్‌ వెల్లడించారు. గతంలో విజయ్ కేబినెట్‌లో సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపుపై విమర్శలు చేసిన విశాల్.. ఇప్పుడు సీఎంను కలిసి అభినందించడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

►ALSO READ | Highest Paid Music Director: ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్!

©️ VIL Media Pvt Ltd.