Reading Time: < 1 minute

SIR ఆషామాషీ కాదు.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే: సీఎం రేవంత్

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐఆర్‎లో భాగంగా మెజారిటీ శాతం ఓట్లు పక్కన పెట్టారని.. అనుమానస్పదం పేరుతో ఓట్లు తొలగించే యత్నం జరుగుతుందన్నారు. ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు.

 వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ అక్టోబరులోనే ఓటర్ల జాబితా ఖరారు అవుతోందని తెలిపారు. ఇప్పుడు ఓట్లు పోతే తర్వాత చేసేదేం ఉండదన్నారు. ప్రతి గ్రామంలో బీఎల్వోలతో నాయకులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. సర్వేలో భాగంగా బీఎల్వోలు ఇంటికి వెళ్లినప్పుడు వలస వెళ్లిన వారు ఇంట్లో ఉండకపోవచ్చని.. అలాంటి ఓట్లు తొలగించకుండా జాగత్ర వహించాలని సూచించారు. 

ఈ నెల 20లోగా ఇన్ ఛార్జ్ మంత్రులు స్థానికంగా సమీక్షించాలని చెప్పారు. ఇన్ ఛార్జ్ మంత్రులు జిల్లా స్థాయిలో మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. 17 ఎంపీ స్థానాల్లో ఎక్కడైనా సమస్య వస్తే పార్లమెంట్ ఇన్‎ఛార్జ్‎దే  బాధ్యత అని అన్నారు. అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీ ఇన్ ఛార్జులు బాధ్యత వహించాలని సూచించారు.

 గాంధీ భవన్‎లో వార్ రూమ్ ద్వారా బూత్ లెవల్ మానిటరింగ్ చేయాలని.. ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పించుకోవాలని చెప్పారు. ఎవరూ నిర్లక్ష్యం వహించినా నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఎస్ఐఆర్‎ను ఆషామాషీగా తీసుకోవద్దు.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే. -సీఎం రేవంత్‌

©️ VIL Media Pvt Ltd.